న్యూఢిల్లీ: డొమెస్టిక్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ కోసం జట్లను ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్‌కు తొలి రౌండ్ మ్యాచ్‌లకు మినహాయింపు ఇచ్చారు. దేశవాళీ కుర్రాళ్లకు, నేషనల్ టీమ్ ప్లేయర్లకు మధ్య బ్యాలెన్స్ తీసుకొచ్చే విధంగా జట్లను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్, రిషబ్ పంత్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బరిలోకి దిగుతున్నాడు.
సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కీపర్లు అర్యన్ జుయల్, అభిషేక్ పోరెల్‌ను కూడా టీమ్ల్లోకి తీసుకున్నారు. టీమ్–ఎకు గిల్, టీమ్–బికి అభిమన్యు ఈశ్వరన్, టీమ్–సికి రుతురాజ్ గైక్వాడ్, టీమ్–డికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నుంచి ఎవరైనా బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపికైతే వాళ్ల ప్లేస్‌లో కొత్త వారికి చోటు కల్పిస్తారు. సెప్టెంబర్ 5 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.