మాసివ్ లుక్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నదుల్కర్

మాసివ్ లుక్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నదుల్కర్

బేసిగ్గా మలయాళ నటుడే అయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు  దుల్కర్ సల్మాన్.  ‘సీతారామం’ వంటి క్లాసికల్ హిట్‌‌‌‌‌‌‌‌తో తన  క్రేజ్‌‌‌‌‌‌‌‌ను మరింత పెంచుకున్నాడు. డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దుల్కర్.. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ‘కింగ్ ఆఫ్ కోతా’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను వదిలారు. ఇందులో దుల్కర్ మాసివ్ లుక్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు. నోట్లో సిగరెట్ పెట్టుకుని సీరియస్‌‌‌‌‌‌‌‌గా చూస్తున్నాడు.

ఇంటెన్సివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సందర్భంగా తన లుక్ గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్. ‘కొందరు అతనికి భయపడతారు. కొందరు అతన్ని గౌరవిస్తారు. కొందరు అతన్ని ప్రేమిస్తారు. కానీ నిజంగా అతనెవరో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు’ అంటూ దుల్కర్ క్యారెక్టర్ గురించి ట్వీట్ చేసింది.  అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య ల‌‌‌‌‌‌‌‌క్ష్మి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీటీమ్ తెలిపింది. తెలుగు,  మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.