రొటీన్ దారిలో వెళ్లకుండా ఏదో ఒక కొత్తదనం ఉండే కథల్ని ఎంచుకుంటాడు దుల్కర్ సల్మాన్. అందుకే తనని ఇతర భాషల ఫిల్మ్ మేకర్స్ కూడా ఏరి కోరి ఎంచుకుంటున్నారు. రీసెంట్‌గా ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు దుల్కర్. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సినిమాతో రాబోతున్నాడు. సన్నీ డియోల్‌తో కలిసి ఆర్.బాల్కి డైరెక్షన్‌లో దుల్కర్ నటించిన ‘చుప్: ద రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్’ చిత్రాన్ని సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్టు నిన్న ప్రకటించారు.
1959లో వచ్చిన ‘కాగజ్‌కే ఫూల్’ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఆ చిత్ర హీరో, దర్శకుడు గురుదత్‌కి ట్రిబ్యూట్‌గా ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు బాల్కి మొదటే చెప్పాడు. గురుదత్ జయంతి నాడే టీజర్‌ని కూడా రిలీజ్ చేశాడు. విశేషమేమిటంటే ఈ సినిమా చూసిన అమితాబ్ బచ్చన్ చాలా ఇంప్రెస్ అయ్యి అప్పటికప్పుడు ఓ పాటను కంపోజ్ చేసి ఇచ్చారట. తమ సినిమాతో అమితాబ్ మ్యూజిక్ కంపోజర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని, ఈ పాట తమ సినిమాకి అమితాబ్ ఇచ్చిన బ్లెస్సింగ్ అని, దాన్ని ఎండ్ టైటిల్స్ సమయంలో వాడుతున్నామని దర్శకుడు చెప్పాడు.