యాక్షన్ లుక్‌‌‌‌‌‌‌‌లో సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తా

యాక్షన్ లుక్‌‌‌‌‌‌‌‌లో సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తా

దుల్కర్‌‌‌‌‌‌‌‌ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. అభి లాష్ జోషి దర్శకుడు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ చెప్పిన విశేషాలు. ‘‘కింగ్ ఆఫ్ కోథా.. ఇందులో కోథా అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. ఇదొక గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ డ్రామా. మంచి ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌షిప్ కూడా ఉంటుంది. యూనిక్ ఒరిజినల్ స్టోరీ.  ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. 

ఈ సినిమా దర్శకుడు నాకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్.  ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా ఈ కథ కుదిరింది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ  ఈ ఒక్క సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డా.  ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని దీన్ని చేశాం. ఇప్పటివరకు నేను ఇలాంటి సినిమా చేయలేదు. స్కేల్ పరంగా బిగ్గెస్ట్ మూవీ. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్  ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.  కథ రెండు పీరియడ్స్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఫుట్ బాల్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లు చాలా ఇంట్రెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయి. ద్రువ్ అనే యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆ సన్నివేశాలని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. 

విజువల్‌‌‌‌‌‌‌‌గా కొత్తగా ఉంటాయి. లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌‌‌‌‌గా కనిపించే నేను.. ఇందులో యాక్షన్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించి ప్రేక్షకులను సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తాను. ఐశ్వర్య లక్ష్మీ  పాత్ర కీలకంగా ఉంటుంది. మా మధ్య మంచి లవ్ ట్రాక్ కూడా ఉంది. అది ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ.. మూడు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను.  జీ స్టూడియోస్ మా పార్టనర్స్‌‌‌‌‌‌‌‌గా చేశారు. అందరం కలిసి బెస్ట్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నించాం. ఇక తెలుగులో సినిమాలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం వెంకీ అట్లూరి  దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నా.  ఇంకొన్ని ఆసక్తికరమైన కథలు కూడా వింటున్నా’’.