తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా మొదలుపెట్టిన దుల్కర్..

తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా మొదలుపెట్టిన దుల్కర్..

తెలుగు ప్రముఖ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న "ఆకాశంలో ఒక తార". ఈ సినిమాలో హీరోగా లక్కీ భాస్కర్ మూవీ ఫేమ్ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ కి జంటగా యంగ్ హీరోయిన్ సాత్విక వీరవల్లి నటిస్తోంది. 

ఆదివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఈ పూజ సెర్మనీలో హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ డైరెక్టర్ పవన్ సాధినేని, హీరోయిన్ సాత్విక వీరవల్లి తదితరులతోపాటూ ఇతర చిత్ర యూనిట్ కూడా హాజరయ్యారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Also Read : నాని కోసం హిట్ మ్యూజిక్ డైరెక్టర్ ని దింపుతున్న శ్రీకాంత్ ..

ఈ విషయం ఇలా ఉండగా హీరో దుల్కర్ సల్మాన్ ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు సినిమాలపై ద్రుష్టి సారిస్తున్నాడు.