ఐయామ్ రిచ్‌ అంతే: అహంకారం కాదు ధైర్యం, బలుపు కాదు బలం

ఐయామ్ రిచ్‌ అంతే: అహంకారం కాదు ధైర్యం, బలుపు కాదు బలం

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ సోమవారం అక్టోబర్ 21న జరిగింది.

దుల్కర్ మాట్లాడుతూ ‘పద్నాలుగు నెలల తర్వాత నా నుంచి వస్తున్న చిత్రమిది. నాకెంతో ప్రత్యేకమైన సినిమా.  ఫన్ రైడ్ ఉన్న ఎమోషనల్‌‌‌‌ మూవీ ఇది.  ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల్లో బాగా ఇష్టమైన పాత్ర ఇందులోని సుమతి. నా మనసుకి ఎంతో దగ్గరైన సినిమా ఇది. దుల్కర్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.

‘ఇందులోని ప్రతి సీన్‌‌‌‌ కొత్తగా ఉంటుంది. బ్యాంకింగ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.

ఇక ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో.. ఒక బ్యాంక్ ఉద్యోగిగా, మరోవైపు కుటుంబం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌గా దుల్కర్, అతను భార్యగా మీనాక్షి కనిపించారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు, అతని ఎలాంటి అడ్డదారులు తొక్కాడు.. దానివల్ల ఎలాంటి అవరోధాలను ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది.

‘అహంకారం కాదు ధైర్యం, బలుపు కాదు బలం,  ఐయామ్ నాట్ బ్యాడ్‌‌‌‌.. ఐయామ్ రిచ్‌‌‌‌’ అంటూ సాగే డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.