బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)..ఇటీవలే రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ లతో, క్యూట్ లుక్స్తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.
ఇదిలా ఉంటే..భాగ్యశ్రీ బోర్సే మరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయబోతుంది ఈ లేటెస్ట్ బ్యూటీ. 'కాంతా'(Kaantha) పేరుతో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీ గ్రాండ్ లంచ్ ఓపెనింగ్ ఈవెంట్ సింపుల్‌గా ఇవాళ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్నాయి. తెలుగులో రూపొందుతోన్న కాంతా సినిమాను తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
'కళాత్మకమైన కథాకథనం మరియు వినూత్నమైన చిత్రనిర్మాణం మేళవించిన కథను మీ ముందుకు తీసుకువస్తోన్నాము.పూజ పూర్తయింది, రోలింగ్ ప్రారంభించడానికి వేచి ఉండలేను" రానా తెలిపారు. ఈ మూవీని సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read:-టొవినో థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగులో భాగ్యశ్రీ బోర్సేకు కాంతా సెకండ్ మూవీ. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.త్వరలోనే ఈ మూవీపై కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ భాగ్య శ్రీ మాత్రమే. తక్కువ టైంలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
A collaboration of two creative powerhouses for an epic tale💥 @DQsWayfarerFilm and @SpiritMediaIN join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥
— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2024
Starring @dulQuer #BhagyashriBorse
Directed by #SelvamaniSelvaraj
Produced by @DQsWayfarerFilm@RanaDaggubati pic.twitter.com/d0r91YIkM3