పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబోలో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇండియన్ మైథలాజి అండ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో భారీ లెవల్లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే.. ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరలవుతోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. తాజాగా వినిపిస్తున్న మరో న్యూస్ ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్స్ ఆడియన్స్ అలరించడానికి సిద్దమవుతున్నారట. ఆ స్టార్స్ మరెవరో కాదు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు హీరోలు కూడా కల్కి సినిమాలో కీ రోల్స్ చేయనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మే 9కి వైజయంతి మూవీస్ బ్యానర్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదే డేట్ కి చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే డేట్ కు కల్కి సినిమా విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని చేస్తున్నారు మేకర్స్. భారీ అంచనాల మధ్య వస్తున్న కల్కి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.