![తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా ఒకే చేసిన దుల్కర్ సల్మాన్... డైరెక్టర్ ఎవరో తెలుసా..?](https://static.v6velugu.com/uploads/2025/02/dulquer-salmaan-announced-kantha-film-with-rana-daggubati_nh6MrjmciX.jpg)
గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాకి ప్రముఖ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. అయితే ఈ మధ్య దుల్కర్ సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో తెలుగులో వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
నూతన డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న "కాంత" అనే సినిమాలో హీరోగా నటించేందుకు ఒకే చెప్పాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జంటగా మిస్టర్ బచ్చన్ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోస్ నటిస్తోంది. స్పిరిట్ మీడియా మరియు వే ఫియర్ బ్యానర్స్ పై టాలీవుడ్ ప్రముఖ హీరో, సినీ నిర్మాత రానా దగ్గుబాటితో కలసి నిర్మస్తున్న దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా భాషలలో రిలీజ్ చేయనున్నారు. అయితే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ గతంలో నీల అనే తమిళ్ సినిమా తీశాడు. ఈ సినిమా నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటిటి లో రిలీజ్ అయ్యింది. కాంత స్టోరీ నచ్చడంతో దుల్కర్ వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం.
ALSO READ | 22 ఏళ్ళు దాటితే ఆంటీ అంటారంటూ స్టోరీ షేర్ చేసిన ఉపాసన..
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ "ఆకాశంలో ఒక తార" అనే క్లాసికల్ లవ్ స్టోరీలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి నూతన డైరెక్టర్ "పవన్ సాదినేని" దర్శకత్వం వహిస్తుండగా స్వప్న సినిమా మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.