నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య.. తన తరువాత సినిమా కోసం రెడీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇదే విషయాన్నీ దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఇండియా వైడ్ గా దుల్కర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేశాడు దుల్కర్. అలాంటి దుల్కర్ బాలయ్య సినిమాలో నటిస్తున్నారంటే అది మాములు విషయం కాదు. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.
Also Read :- వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్గా శార్వరి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ?