దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఒక సాధారణ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే సరికొత్త కాన్సెప్ట్ తో లక్కీ భాస్కర్ రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్‌లో సాగే ఈ కథకు ప్రతిఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. దాంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం (నవంబర్ 1న) ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కర్ యొక్క బాక్సాఫీస్ సెన్సేషన్ ప్రారంభం.. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని" తెలిపారు. అలాగే రూ. 7.50 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ప్రివ్యూ వసూళ్లతో సహా మొత్తం ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ రూ.8.50 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తోన్న పాజిటివ్ టాక్తో.. వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
Also Read :- ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు. కానీ, నాకు?
Sacnilk ప్రకారం.. లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే.. ఉదయం షోలలో 29.52%తో ప్రారంభించి, మధ్యాహ్నం 48.24%కి పెరిగింది, తర్వాత సాయంత్రం షోలకు 32.83%కి మరియు రాత్రికి 43.13% ఆక్యుపెన్సీతో తొలిరోజును ముగించింది.
Baskhar's 𝐒𝐄𝐍𝐒𝐀𝐓𝐈𝐎𝐍𝐀𝐋 start at the Box-Office 🔥#LuckyBaskhar Grosses over 𝟏𝟐.𝟕𝟎 𝐂𝐑 on 𝐃𝐀𝐘 𝟏 Worldwide! 💰
— Sithara Entertainments (@SitharaEnts) November 1, 2024
𝑼𝑵𝑨𝑵𝑰𝑴𝑶𝑼𝑺 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🤩🏦
In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/TyyROziA89 @dulQuer #VenkyAtluri… pic.twitter.com/MjOBLbbP13
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో.. స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకుల్లో జరిగే స్కామ్లు జరుగుతున్నా విషయం వింటుంటుంటాం..చూస్తుంటాం. కానీ అవేమాత్రం సామాన్య మనుషులకి అర్ధమయ్యేలా ఉండవు. ఇదే విషయాన్ని..అంటే 'ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును..అందరికీ అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్స్ తో వెంకీ అట్లూరి చూపించిన విధానం బాగుంది.
ఇక డైరెక్టర్ వెంకీ రాసుకున్న బలమైన స్క్రిప్టుకు హీరో దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఓ చిన్న బ్యాంక్ ఉద్యోగి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కొని.. అలా కోట్లు సంపాదించి, వాటిని క్షణాల్లో ఖర్చు చేసేసి ఎలా మారడనే ఈ కథనం అందరినీ మెప్పించేలా చేస్తోంది.