
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’(Lucky Baskhar). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఒక సాధారణ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే సరికొత్త కాన్సెప్ట్ తో లక్కీ భాస్కర్ రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్‌లో సాగే ఈ కథకు ప్రతిఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. దాంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
Also Read:- ధనుష్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు..
లేటెస్ట్గా (నవంబర్ 14న) లక్కీ భాస్కర్ రూ.100 కోట్ల క్లబ్కు చేరువయ్యాడు అంటూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. "మెగా బ్లాక్‌బస్టర్ లక్కీ భాస్కర్ మూవీ బాక్సాఫీస్ వద్ద 100% స్ట్రైక్ రేట్‌తో టాప్‌లో నిలిచింది.. మీకు దగ్గర్లో ఉన్న థియేటర్స్లో మా భాస్కర్ ఉంటాడు చూడటం మిస్ కాకాకండి " అంటూ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వెల్లడించింది.ఈ సినిమాతో సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ తీసి మరో హిట్ అందుకున్నాడు
? ??????? ?????? ????? ????????? ??
— Sithara Entertainments (@SitharaEnts) November 14, 2024
The ???? ??????????? #LuckyBaskhar made it to the TOP, With a 100% strike rate at the Box-Office. ?
- https://t.co/HrR1cFsC3O
Watch #BlockbusterLuckyBaskhar at Cinemas Near you! ?@dulQuer… pic.twitter.com/JYS05A9f05
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో.. స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకుల్లో జరిగే స్కామ్లు జరుగుతున్నా విషయం వింటుంటుంటాం..చూస్తుంటాం. కానీ అవేమాత్రం సామాన్య మనుషులకి అర్ధమయ్యేలా ఉండవు. ఇదే విషయాన్ని..అంటే 'ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును..అందరికీ అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్స్ తో వెంకీ అట్లూరి చూపించిన విధానం బాగుంది.
ఇక డైరెక్టర్ వెంకీ రాసుకున్న బలమైన స్క్రిప్టుకు హీరో దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఓ చిన్న బ్యాంక్ ఉద్యోగి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కొని.. అలా కోట్లు సంపాదించి, వాటిని క్షణాల్లో ఖర్చు చేసేసి ఎలా మారడనే ఈ కథనం అందరినీ మెప్పించేలా చేస్తోంది.