దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్(Lucky Bhaskar). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దుల్కర్ హీరోగా కెరీర్ ప్రారంభించి పన్నెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మగధ అనే బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నట్టుగా దుల్కర్ పాత్రను పరిచయం చేశారు.
ఎయిటీస్ నాటి బొంబాయి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. డిపరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉంటుందని చెప్పారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.