విభిన్నమైన సినిమాలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది.
దీపావళి కానుకగా అక్టోబర్ 31 రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 27 రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అంతేగాకుండా సినిమా విడుదలైన మూడు వారాల్లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే మొదటి వంద కోట్ల సినిమాగా లక్కీ భాస్కర్ నిలిచింది. తెలుగులో దుల్కర్ నటించిన మొదటి సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కడంతో మరో మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో నవంబర్ 30న లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వారు లక్కీ భాస్కర్ సినిమాని ఓటిటి లో చూడచ్చు.