సీతారామం రిలీజ్ డేట్ కన్ఫామ్

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో దుల్కర్ సల్మాన్. ఈ మలయాళ స్టార్ విలక్షణమైన పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో సీతారామం అనే మూవీని చేస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..రష్మిక మందన కీలక పాత్ర పోషిస్తోంది. మిలటరీలో పనిచేస్తే వ్యక్తి , ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న అంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు హను రాఘవపూడి.

ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సహా టీజర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీని ఆగష్టు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. చరిత్రలోని ఓ ప్రేమకథ త్వరలోనే మీ ముందుకు వస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ మూవీని తెలుగుతోపాటు తమిళ్,మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మన్స్, మృణాల్ ఠాకూర్ గ్లామర్, రష్మిక నటన ఈ సినిమాకు హైలెట్స్ గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్. 

మరిన్ని వార్తల కోసం

ప్రధానికి మొహం చూపించలేక కర్ణాటకకు కేసీఆర్

మనాలీలో అఖిల్ భయపెట్టించే యాక్షన్ సీన్స్