LuckyBaskhar: లక్కీ భాస్కర్ మరో రికార్డ్.. ఫలించిన వెంకీ అట్లూరి, దుల్కర్ల ప్రయత్నం

LuckyBaskhar: లక్కీ భాస్కర్ మరో రికార్డ్.. ఫలించిన వెంకీ అట్లూరి, దుల్కర్ల ప్రయత్నం

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా వరుస రికార్డులతో దూసుకుపోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి వారంలో ఏకంగా 15 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో మొదటి స్థానాన్ని పొందింది.

అలాగే 17.8 బిలియన్ నిమిషాల వీక్షణలతో, రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన తొలి దక్షిణాది సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కోసం దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో దుల్కర్ చేసిన ప్రయత్నం ఫలించింది.

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో.. స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకుల్లో జరిగే స్కామ్లు జరుగుతున్నా విషయం వింటుంటుంటాం..చూస్తుంటాం. కానీ అవేమాత్రం సామాన్య మనుషులకి అర్ధమయ్యేలా ఉండవు. ఇదే విషయాన్ని..అంటే 'ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును..అందరికీ అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్స్ తో వెంకీ అట్లూరి చూపించిన విధానం బాగుంది.

ALSO READ : Sankranthiki Vasthunam OTT: అఫీషియల్.. ఒకేసారి ఓటీటీ, టీవీల్లోకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఎప్పటినుంచంటే?

ఇక డైరెక్టర్ వెంకీ రాసుకున్న బలమైన స్క్రిప్టుకు హీరో దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఓ చిన్న బ్యాంక్ ఉద్యోగి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కొని.. అలా కోట్లు సంపాదించి, వాటిని క్షణాల్లో ఖర్చు చేసేసి ఎలా మారడనే ఈ కథనం అందరినీ మెప్పించేలా చేస్తోంది.