Lucky Baskhar Movie: సైన్యంలో లెఫ్టినెంట్ రామ్..డబ్బు కట్టల మధ్య లక్కీ భాస్కర్

సీతా రామమ్ (Sitha Ramam) సక్సెస్ తరువాత పాన్ ఇండియా లెవల్లో హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే ఈ హీరో నుండి వస్తున్న సినిమాలపై మంచి బజ్ క్రియేట్ ఆవుతోంది. మేకర్స్ కూడా దుల్కర్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

దుల్కర్ మరోసారి తెలుగు డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సర్ సినిమాతో ధనుష్ (Danush)కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి(Venky Atluri) డైరెక్షన్లో లక్కీ భాస్కర్ (Lucky Baskhar) మూవీ చేస్తున్నాడు.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ గా కనిపించనున్నాడు. ఈ పోస్టర్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ కథనాన్ని తెలిపేలా మేకర్స్ కట్ చేశారు.

హీరో చుట్టూరా..డబ్బు కట్టలు..మధ్యలో బ్యాంక్ ఉద్యోగిగా కళ్ళజోడు పెట్టుకొని, నీట్గా మధ్య పాపిడి తీసుకొని సూట్ కేసుతో నడుస్తూ దుల్కర్ నడిసొచ్చే తీరు ఆసక్తిగా ఉంది. ఈ పోస్టర్ను బట్టే ఈ సినిమా కథేంటనేది అర్ధమవుతుంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సాధారణ వ్యక్తి కథే లక్కీ భాస్కర్ అని సమాచారం. 

ఇక సీతా రామమ్ తరువాత దుల్కర్ నుండి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో..ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించనుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.