విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)- దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)..ఈ గ్రేటెస్ట్ కాంబో నుంచి థగ్‌లైఫ్ సినిమా తెరకెక్కుతోంది.వీరిద్దరి కాంబోలో 1987లో వచ్చిన నాయకన్ మూవీ..తెలుగులో నాయకుడు గా రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మరోసారి జతకట్టనున్న ఈ కాంబోలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు దుల్కర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ కోలీవుడ్ హీరో థగ్‌లైఫ్ సెట్స్‌లో అడుగుపెట్టకుముందే గుడ్‌బై చెప్పాడు. దుల్కర్ చాలా మంచి నటుడు..ఆయన ఏ మూవీ చేసిన తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాడు. కానీ, థగ్‌లైఫ్ వంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించకపోవడానికి కారణాలు ఏంటనేవి ఇంకా తెలియాల్సి ఉంది. కమల్‌హాసన్‌తో పాటు మణిరత్నంలకు దుల్కర్ ఈ ప్రాజెక్ట్ లోనటించడానికి కారణాలను మాత్రం వివరించినట్లు తెలిసింది
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళం,హిందీ భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.తెలుగులో లక్కీ భాస్కర్, తమిళంలో సూర్య, సుధా కొంగర కాంబోలో వస్తోన్న మూవీతో పాటు.. ఓ హిందీ మూవీలో నటిస్తున్నాడు. అందువల్ల థగ్‌లైఫ్ మూవీ కోసం డేట్స్ సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని..అందుకే కమల్‌హాసన్ వంటి విశ్వనటుడు సినిమా నుంచి దుల్కర్ తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే, దుల్కర్ స్థానంలో థగ్‌లైఫ్‌లో తెలుగు స్టార్ హీరో నానిని తీసుకోవాలనే ఆలోచనలో డైరెక్టర్ మణిరత్నం ఉన్నట్లు తెలుస్తోంది. నానికి ఈ అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.హీరో నానికి మణిరత్నం ఫేవరేట్ డైరెక్టర్ అని పలు వేదికల మీద చెప్పుకొచ్చాడు.
అంతేకాదు..అతడితో ఒక్క సినిమానైనా చేయాలన్నది తన కల అని కూడా అన్నారు. మరి నానికి తన ఫేవరేట్ డైరెక్టర్ నుంచి పిలుపు వస్తే మాత్రం..క్షణంలో వాలిపోవడం కన్ఫమ్ అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, హీరో ఉదయ్ నిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ALSO READ :- War 2: వార్ 2 లేటెస్ట్ అప్డేట్.. ఎన్టీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధం!
ఈ మూవీకి ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ఫైట్ మాస్టర్ గా అన్బరివ్ పని చేస్తుండగా..ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ హాసన్ అల్టిమేట్ క్లాసిక్ అయిన తెనాలి మూవీకి..వర్క్ చేసిన రెహమాన్..దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ పనిచేస్తుండడం విశేషం.