మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న లక్కీ భాస్కర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా నటించాడు. దుల్కర్ సల్మాన్ కి జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగుతోపాటూ మరో 4 భాషలలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ సల్మాన్ కొందరు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.
ALSO READ : ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ వేడుకల్లో ఎమోషనల్ అయిన మెగాస్టార్ చిరు..
ఇందువలో భాగంగా ఓ రిపోర్టర్ ఏకంగా మొదటిరోజు లక్కీ భాస్కర్ రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ ప్రొడ్యూసర్ నాగవంశీ కామెంట్ చేశారని దీనిపై మీ స్పందన ఏమిటని అడిగాడు. దీంతో దుల్కర్ సల్మాన్ సరదాగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇందులోభాగంగా ఆదేగనుక జరిగితే నిర్మాత నాగవంశీ ఫోటోని ఫ్రేమ్ కట్టించి మా ఇంట్లో పెట్టుకుంటా అని అన్నాడు. అలాగే 13 ఏళ్ల నా సినీ జీవితంలో దాదాపుగా 40 సినిమాల్లో నటించానని తన సినిమా మొదటిరోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమనేది తన డ్రీమ్ అని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా హీరో దుల్కర్ సల్మాన్ కి భాషతో సంబంధం లేకుండా సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే మలయాళం తర్వాత దుల్కర్ సల్మాన్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. కానీ పలు డబ్బింగ్ సినిమాలలో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. మరి లక్కీ భాస్కర్ సినిమాతో టాలీవుడ్ లో హిట్ కొడతాడో లేదో చూడాలి.