మడికొండను కమ్మేసిన డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొగ

  • ఘాటైన వాసనతో జనాలు ఉక్కిరిబిక్కిరి

ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కాజీపేట, వెలుగు :  హనుమకొండ జిల్లా మడికొండ సమీపంలోని డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వెలువడుతున్న పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన పొగ మడికొండతో పాటు డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ, మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ, ఎలుకుర్తి, ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివారు ప్రాంతాలను కమ్మేసింది. 

పొగతో పాటు ఘాటైన వాసనలు రావడంతో స్థానికులతో పాటు, వాహనదారులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరలించాలని ఎన్ని సార్లు కోరినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.