కళ్లు నెత్తికెక్కి నడుపుతున్నారా.. : లారీ ఢీకొని తండ్రి కళ్లెదుటే చిన్నారి మృతి

కళ్లు నెత్తికెక్కి నడుపుతున్నారా.. : లారీ ఢీకొని తండ్రి కళ్లెదుటే చిన్నారి మృతి

ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీ రోడ్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం ఓ పాఠశాల విద్యార్థిని ప్రాణాలను బలికొంది. చిన్నారి తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తుండగా ఒబెరాయ్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డంపింగ్ లారీ ఢీకొనడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంలో పోలీసులు అక్కడికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

చెంబూర్‌లోని సింధీ కాలనీ సమీపంలో కూడా ఆదివారం ఉదయం యాక్సిడెంట్ జరింగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గత మూడు రోజులు నాల్గైదు హిట్ అండ్ రన్ కేసులు నమోదైయ్యాయని ఆయా ప్రాంతం పోలీసులు తెలిపారు.