కమ్మేస్తున్న ‘డంపింగ్​యార్డు’ పొగ!

కమ్మేస్తున్న ‘డంపింగ్​యార్డు’ పొగ!

 భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఎన్​కే నగర్​తండాను రోజూ పొగ కమ్మేస్తోంది. ఇక్కడి గ్రామపంచాయతీలోని డంపింగ్​ యార్డులో తడిపొడి చెత్తను వేరు చేసి రిసైక్లింగ్​ చేయాల్సి ఉండగా, అలా కాకుండా చెత్తకు నిప్పుపెడుతున్నారు. ఫలితంగా స్థానికులకు అవస్థలు తప్పడం లేదు.వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.