
హనుమకొండ, వెలుగు: మడికొండ డంప్‌యార్డు సమస్యకు మార్చి నాటికి పరిష్కారం చూపుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్నాగరాజు హామీ ఇచ్చారు. డంపింగ్‌యార్డు తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమం చేపట్టిన అడ్హక్కమిటీ సభ్యులు బుధవారం హనుమకొండలోని క్యాంప్‌ఆఫీస్‌లో ఎమ్మెల్యే కేఆర్నాగరాజును కలిశారు. డంప్‌యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, చాలామంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్‌హక్ కమిటీ సభ్యులు ఎర్రగట్టు స్వామి, కరుణాకర్‌రెడ్డి, దువ్వ నవీన్ తదితరులు పాల్గొన్నారు.