ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించిన ఆశ వర్కర్స్

మరిపెడ, వెలుగు: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీఐటీయూ మహబూబాద్ జిల్లా నాయకులు దుండి వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని డోర్నకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. ఎన్ హెచ్ ఎం స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడం సరికాదన్నారు.

బడ్జెట్ ను పెంచాలని,హెల్త్ డిపార్ట్​మెంట్​ను ప్రైవేట్ పరం చేయొద్దని, ఆశ వర్కర్లకు ఈఎఫ్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్​ లీడర్లు వీరన్న, ఉపేంద్ర, ఆసియా, మంగమ్మ, నిర్మల, వసంత, శ్రీజ పాల్గొన్నారు.