రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్‌ ఠాణా

రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్‌ ఠాణా

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌గా నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలిస్థానం దక్కింది. 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్‌ ఠాణా నిలిచింది. రాష్ట్రంలో దుండిగల్‌ ఠాణా తొలిస్థానంలో నిలవడంపై డీజీపీ అంజనీకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ఇతర పోలీసు స్టేషన్‌లకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఠాణా ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందిని అభినందించి, సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల వార్షిక ర్యాకింగ్స్‌ను విడుదల చేస్తుంటుంది.