IND vs SL 1st ODI: నిశాంక‌, వెల్ల‌లాగే హాఫ్ సెంచ‌రీలు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

IND vs SL 1st ODI: నిశాంక‌, వెల్ల‌లాగే హాఫ్ సెంచ‌రీలు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

కొలంబో వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలింగ్ తో అదరగొట్టింది. ఆతిధ్య శ్రీలంకను తక్కువ స్కోర్ కే కట్టడి చేసి సత్తా చాటారు. అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్ లతో పాటు బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. 66 పరుగులు చేసిన దునీత్ వెల్లలాగే టాప్ స్కోరర్ కాగా.. ఓపెనర్ నిస్సంక (56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు సిరాజ్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో ను ఒక పరుగుకే అవుట్ చేసి శుభారంభం ఇచ్చాడు. కుశాల్ మెండీస్(14), సుధీర సమర విక్రమ్ (8), అసలంక(14), లియాంగ్ (20) క్రీజ్ లో కుదురుకున్నట్టు కనిపించినా.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. వికెట్లు పడుతున్న మరో ఎండ్ లో నిశాంక భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే వాషింగ్ టన్ ఒక అద్భుతమైన బంతితో నిశాంక ను పెవిలియన్ కు పంపించడంతో లంక జట్టు 101 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. 

ఈ దశలో శ్రీలంక 150 పరుగులు చేయడం కూడా కష్టంగా అనిపించింది. అయితే 21 ఏళ్ళ దునీత్ వెల్లలాగే అనూహ్యంగా పోరాడాడు. లోయర్ ఆర్డర్ లో కీలక భాగస్వామ్యాలు నిర్మిస్తూ లంక జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించాడు. హసరంగా(24), అఖిల ధనుంజయ్ (17) లతో కలిసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. మహమ్మద్ సిరాజ్, దూబే, కుల్దీప్ యాదవ్, సుందర్ లకు తలో వికెట్ దక్కింది.