భారీ ధరకు అమ్ముడైన డంకీ ఓటీటీ రైట్స్.. కేవలం 25 రోజుల్లోనే?

భారీ ధరకు అమ్ముడైన డంకీ ఓటీటీ రైట్స్.. కేవలం 25 రోజుల్లోనే?

ఇప్పటికే పఠాన్‌(Pathaan), జవాన్(Jawan) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ(Dunki). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ(Rajkumar Hirani) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుండి కూడా డంకీ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. డంకీ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాస్ రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సాధారణంగా ఏ సినిమా అయినా.. థియేట్రికల్ రిలీజ్ తరువాత కనీసం నాలుగు వారాల తరువాత ఓటీటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డంకీ సినిమా మాత్రం..  సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంటే కేవలం థియేటర్స్ లో రిలీజైన 25 రోజుల లోనే ఓటీటీలోకి రానుంది డంకీ మూవీ. దీంతో షారుఖ్ అండ్ ఓటీటీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.