మంచిర్యాలలో 33 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత

మంచిర్యాలలో 33 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత

 13 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న 13 మందితో కూడిన అంతర్​ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.వీరి నుంచి రూ. 66 లక్షల విలువైన 33 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్ కన్వన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుం డం సీపీ వి.సత్యనారా యణ, మంచిర్యాలడీ సీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు.

మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, తాళ్లగురిజాల, నెన్నెల, కన్నె పల్లి పోలీస్ స్టేష న్ పరిధికి చెందిన కొందరు వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నంద్యాల, గుజరాత్ రాష్ట్రం తదితర ప్రాంతాల నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకు వస్తున్నారు. వీరు ముఠాలుగా ఏర్పడి అమాయక రైతులకు మోస పూరితంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తూ  లాభాలు గడిస్తున్నారు. రామగుం డం సీపీ సత్యనారాయణ ఆదేశాలతో వారి కదలికలపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దృష్టి సారించారు. శనివారం ఆరు బృందాలుగా ఏర్పడిన టాస్క్​ఫోర్స్ పోలీసులు పలుప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విత్తనాల అక్రమ వ్యా పారం, రవాణా, నిల్వ తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరి నుంచి రూ.66లక్షల విలువైన 33 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్​ఫోర్స్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో మంచిర్యాల, బెల్లం పల్లి ఏసీపీలు గౌస్ బాబా, బాలు జాదవ్ , జిల్లా వ్యవసాయాధికారి వీరయ్య, టా స్క్​ఫోర్స్ సీఐ సాగర్​, మంచిర్యాల సీఐ ఎడ్ల మహేశ్, వ్యవసాయాధికారి కృష్ణ,  టా స్క్​ఫోర్స్ ఎస్సై సమ్మయ్య, ఎస్సైలు రాజ్ కుమార్, శ్రీకాంత్ కిరణ్ , శివకుమార్​ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలతో మోసపోవద్దు

తక్కువ ధరకు వస్తుందని దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులుమోసపోవద్దు . ప్రభుత్వం ఆమోదం కలిగిన విత్తనాలు మాత్రమే కొనాలి. నకిలీ విత్తనాలు, గడ్డిమందును విక్రయించే ముఠాలు సంచరించే విషయం మా దృష్టికి తీసుకురావాలి. అరెస్టయిన 13మందితో పాటు మరో 20 మంది నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.నంద్యాల, గుంటూరు, గుజరాత్ ప్రాంతాలకు చెందిన మరికొందరిని పట్టు కోవడానికి రెండుబృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి . జిల్లా వ్యవసాయ అధికారుల సమన్వయంతో నిఘాపెంచుతాం . అక్రమ వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తాం.– వి.సత్యనారాయణ, రామగుండం సీపీ