మట్టితో నాణ్యమైన ఇటుకల తయారీకి ట్రైనింగ్

మట్టితో నాణ్యమైన ఇటుకల తయారీకి ట్రైనింగ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ ​వి పాటిల్​ 

భద్రాచలం, వెలుగు : తక్కువ పెట్టుబడితో గ్రామాల్లో లభించే వనరులతో మన్నికైన ఇటుకలు తయారు చేసుకోవడానికి స్పెషల్ ట్రైనింగ్​ ఇస్తున్నట్లు భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​తెలిపారు. ఐటీడీఏ వైటీసీ ( యూత్​ ట్రైనింగ్​ సెంటర్​) లో తయారు చేసిన ఇటుకలను ఆయన శుక్రవారం ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణలకు చూపించారు. ఇటుకల తయారీకి కావాల్సిన ముడిసరుకులు, తయారీ విధానం గురించి ఎమ్మెల్యేలకు వివరించారు. ఇటుకల తయారీకి ఏడు శాతం మట్టి, రెండు శాతం సున్నం, ఒక శాతం సిమెంట్​ కలిపి తయారు చేశాక 20 రోజుల పాటు ఆరబెట్టాలన్నారు. ఈ ఇటుకలతో కట్టుకున్న ఇళ్లకు 10 ఏళ్ల పాటు ఢోకా ఉండదని చెప్పారు. ప్రస్తుతం 80 మందికి ట్రైనింగ్​ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్​, ఏవో రాంబాబు, డీఈ హరీశ్, భద్రాచలం తహసీల్దారు శ్రీనివాస్​ ఉన్నారు.

సర్వే తనిఖీ

భద్రాచలంలో సమగ్ర కుటుంబ సర్వేను శుక్రవారం కలెక్టర్​జితేశ్​ తనిఖీ చేశారు. ఎమ్యునేటర్​శ్రీనివాస్, సూపర్​ వైజర్​ బాలకృష్ణతో మాట్లాడి సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సమాచారం ఇస్తున్న కుటుంబ సభ్యులను కూడా ఆయన ప్రశ్నించారు. సర్వే సంతృప్తికరంగా జరుగుతున్నట్లు కలెక్టర్​ వెల్లడించారు. కలెక్టర్​ వెంట తహసీల్దారు శ్రీనివాసరావు ఉన్నారు.