సూర్యాపేట జిల్లా: దురాజ్​పల్లి లింగమతుల జాతర విశేషాలివే..

సూర్యాపేట జిల్లా: దురాజ్​పల్లి లింగమతుల జాతర విశేషాలివే..

 సూర్యాపేట జిల్లాదురాజ్ పల్లి పెద్దగట్టు లింగామంతుల స్వామి జాతర  ఈనెల 16 వతేదివైభవంగా ప్రారంభమైంది. యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి జాతర  ప్రారంభమైంది.  20వ తేది వరకు జరుగుతుంది.  తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో భక్తులు  ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాతర నోడల్ అధికారి , సూర్యాపేట ఆర్డిఓ పరిశీలిస్తున్నారు.  

ఆదివారం ( ఫిబ్రవరి 16)  బేరి చెప్పులతో గజ్జల లాగుల సవ్వడులతో  ప్రారంభమైన లింగామతుల జాతరలో  ఓ లింగా..ఓ లింగా.. అంటూ శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు దద్దరిల్లాయి.   రెండెళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే మొదటి  ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

  •  మొదటిరోజు గుడి చుట్టూ గంపల ప్రదక్షణ
  • రెండవ రోజు చౌడమ్మకు బోనాలు
  • మూడవరోజు చంద్రపట్నం వేయుట 
  • నాలుగవ రోజు నెలవారం 
  • చివరగా జాతర ముగింపు కార్యక్రమాలు 

పెద్దగట్టు లింగమతుల జాతరను  జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ మానిటరింగ్ చేస్తున్నారు.  గతంలో కంటే  భక్తులు అధికంగా జాతరకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండువేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.   

ALSO READ | ధ్యానం మనోశాంతికి దివ్య ఔషధం

మహిళలు ఇబ్బందులు పడకుండా  వందమందితో షీ టీమ్స్, జాతర పరిసర ప్రాంతాలలో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  దేవాదాయశాఖ ద్వారా షిప్టుకు 30 మంది చొప్పున ...మూడు షిఫ్టుల్లో 90 మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.  జాతరలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా 110 మంది విద్యుత్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మిషన్ భగీరధ ప్రధాన పైప్ ద్వారా భక్తులకు త్రాగు నీరును అందిస్తున్నారు.   వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 8 చోట్ల ప్రధమ చికిత్స కేంద్రాలో 24 మంది డాక్టర్లతో పాటు ..190 మంది సిబ్బంది విధులునిర్వహిస్తున్నారు. భక్తులు జాతరకు వచ్చేందుకు  200 మంది సిబ్బందితో   60 ప్రత్యేక బస్సులు తిరుగుతున్నాయి.