SA20: మ్యాచ్ ఫిక్సింగ్‌పై అనుమానాలు.. ప్రిటోరియా షాకింగ్ ఓటమి

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో షాకింగ్ ఓటమి సంచలనానికి గురి చేస్తుంది. శుక్రవారం (జనవరి 10) డర్బన్ సూపర్ జయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య ఊహించని ఫలితం వచ్చింది. డర్బన్ విధించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రిటోరియా 12 ఓవర్లలో 152 పరుగులు చేసి గెలుపు దిశగా దూసుకెళ్తుంది. గెలవాలంటే మరో 48 బంతుల్లో 58 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ దశలో  ప్రిటోరియా క్యాపిటల్స్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.  క్యాపిటల్స్ ఓటమి అనుమానాలకు దారి తీస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కేన్ విలియంసన్ 40 బంతుల్లో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాతీయ జట్టు కాంట్రాక్ట్ వదులుకొని ఫ్రాంచైజీ లీగ్ లో ఎంట్రీ ఇచ్చిన విలియంసన్ తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడు. విలియంసన్ తో పాటు మల్డర్ 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

Also Read :- మెరుపు సెంచరీతో దుమ్ములేపిన స్టీవ్ స్మిత్

భారీ లక్ష్య ఛేదనలో ప్రిటోరియా క్యాపిటల్స్ 7 వికెట్లకు 207 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు గర్భాజ్ (89) సునామీ ఇన్నింగ్స్ యూ తోడు జాక్స్ హాఫ్ సెంచరీ చేయడంతో ఒక దశలో విజయం ఖామనుకున్నారు. ఈ దశలో డర్బన్ బౌలర్లు విజృంభించడంతో క్యాపిటల్స్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. చివరి ఓవర్ లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. నవీన్ ఉల్ హక్ వేసిన ఈ ఓవర్ లో 11 పరుగులే వచ్చాయి.