భైంసా/కోల్‌బెల్ట్, వెలుగు: భైంసాలో దుర్గామాత నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవారు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. ముందుగా భవానీ చౌక్‌లో దుర్గమాతకు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. డీజే, బ్యాండు మేళాల మధ్య యువకులు నృత్యాలు చేయగా, మహిళలు కొలాటాలు ఆడుతూ సందడి చేశారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గత సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని కాలనీల్లో వెలసిన దుర్గామాత విగ్రహాలను శోభాయాత్రగా తరలించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.