తిమ్మాపూర్​ మండలంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

తిమ్మాపూర్, వెలుగు : తిమ్మాపూర్​ మండలం మహాత్మానగర్ లో శ్రీదేవి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత పల్లకీ సేవను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత స్వాములు, చిన్నారులు ఆటపాటలతో డీజే చప్పులతో అమ్మవారిని వాడవాడన ఊరేగించారు. కార్యక్రమంలో మహాత్మ నగర్ సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్, నిర్వాహకులు పాల్గొన్నారు.