హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ను గురువారం విజయవాడకు చెందిన హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. జనవరి 21న కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞం లక్ష మందితో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ ప్రచార రథంలో గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్​ శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు.