
సూర్యాపేట, వెలుగు: తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలివేల దుర్గారావు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కోడే వాసుదేవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, పీవీ నరసింహారావు దేశానికి దశ, దిశను చూపించారని, టీడీపీ వచ్చాకే తెలుగు వారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.