30 ఏళ్ల కింద అన్ని అనుమతులిచ్చి..ఇపుడు కూలుస్తారా.?: దుర్గం చెరువు అమర్ సొసైటీ

30 ఏళ్ల కింద అన్ని అనుమతులిచ్చి..ఇపుడు కూలుస్తారా.?: దుర్గం చెరువు అమర్ సొసైటీ

జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు వెల్లడించారు. 1991 అప్రూవల్ లే ఔట్ అయ్యిందని.. అందులో 140  ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు.  30 ఏళ్ల కింద కట్టుకున్న తమను 30 రోజుల్లో ఖాళీ చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.

GHMC అన్ని అనుమతులు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్స్ తీసుకొని ఇల్లులు నిర్మించుకున్నాం. అన్ని అనుమతులు తీసుకున్నాం. 2020 లో  ప్లడ్స్  వచ్చాయి.. గత ప్రభుత్వం మా ఫ్లాట్స్ FTL పరిధిలోకి రావని చెప్పింది.  ప్రభుత్వాలు మారితే  ఆధారాలు, భూమి సంబందించిన కాగితాలు మారవు కదా.?.  మేము అనుమతి తీసుకుంది 1991లో అప్పడు FTL.. బఫర్ జోన్ లు అంశం లేదు.  అప్పట్లో దుర్గం చెరువు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందనేది  అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. 

ALSO READ | హైడ్రా తగ్గేదేలా : మియాపూర్ ఈర్ల చెరువులో అపార్ట్ మెంట్స్ నేల మట్టం

30 రోజుల్లో ఖాళీ చేయాలనీ నోటీసులు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలనుంచి ఉంటున్న మమ్మల్ని 30 రోజుల్లో ఖాళీ చేయాలనీ ఎలా చెబుతారు.?  అన్ని డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నాం.  వాల్టా చట్టం రాక ముందే మేము అన్ని అనుమతులు తీసుకున్నాం. అని అమర్ సొసైటీ సభ్యులు తెలిపారు. 

దుర్గం చెరు పరిధిలో ఎఫ్ టీఎల్ లో నిర్మాణాలు చేపట్టిన 204 మందికి శేర్లింగంపల్లి తహసీల్దార్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. నోటీసులు అందుకున్న వారిలో  సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. ఇంకా పలువురు సీనీ,రాజకీయ ప్రముఖులు ఉన్నారు.