కార్పొరేషన్​ ఏర్పాటుపై చొరవచూపిన వివేక్​కు రుణపడి ఉంటాం : దుర్గం నరేశ్

చెన్నూరు/జైపూర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన చేసిన నేపథ్యంలో నేతకాని కులస్తులు సీఎంతోపాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, లింగన్న పేట గ్రామం,  జైపూర్​ మండల కేంద్రంలో వేర్వేరుగా సీఎం, వివేక్​ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతకాని(మహర్) సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు దుర్గం నరేశ్​ మాట్లాడుతూ.. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి  ప్రకటన చేయడం తమ సామాజిక వర్గం ఉన్నతిపై ఆశలు రేపిందన్నారు. 

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి, చొరవతోనే సీఎం ఈ ప్రకటన చేశారని కొనిడాయారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం, ఎమ్మెల్యే వివేక్​కు తమ కుటుంబాలు రుణపడి ఉంటాయన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు తెలుపుతూ.. ఆయన గెలుపుకోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లీడర్లు రాంటెంకి పోచం, దుర్గం గోపాల్,  దుర్గం నగేశ్,  దుర్గం వెంకటస్వామి, రావుల తిరుపతి, కామెర సంపత్, సుందిళ్ల మొగిలి, నేతకాని మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ దుర్గం లింగయ్య, మహిళా కోఆర్డినేటర్ అనూష, జంబిడి లక్ష్మి, చెన్నూర్ నియోజకవర్గం, జైపూర్ మండల కోఆర్డినేటర్లు జాడి రమేశ్, జనగామ మంగ,  జాడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.