లక్ష్మణచాంద, వెలుగు: మండలంలోని ఫీచర గ్రామంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద గురువారం బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డీజే సప్పుళ్ల మధ్య యువత నృత్యాలు, మహిళలు మంగళ హారతులు, బోనాలు ఎత్తుకొని గ్రామంలో ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.