
ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కొనిజర్ల మండలం అంజనాపురంలో 120 ఎకరాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయను న్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్, సీపీఎం, తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేటీఆర్ పర్యటన సందర్బంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టి కూలీలు, ప్రయాణికులను సైతం అడ్డుకున్నారు. ఆటోల్లో మహిళా కూలీలు పనులకు వెళ్తుండగా వారిని ఆటోలోంచి దించి కాలినడకన వెళ్లాలని పంపించారు. పాల వాహనాలకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు కూడా వెనక్కి పంపించారు.
ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సీపీఎం, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలను సైతం అరెస్ట్ చేసి చెట్ల కింద కూర్చోబెట్టారు.