గొడవలన్నీ వదిలేసిన మంచు మనోజ్.. ‘భైరవం’ షూటింగ్ సెట్లో ప్రత్యక్షం

గొడవలన్నీ వదిలేసిన మంచు మనోజ్.. ‘భైరవం’ షూటింగ్ సెట్లో ప్రత్యక్షం

మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెర పడింది. ఈ గొడవంతా వదిలేసి మనోజ్ తన తాజా సినిమా ‘భైరవం’ షూటింగ్కు వెళ్లిపోయినట్లు తెలిసింది. ‘భైరవం’ షూటింగ్ సెట్లో మనోజ్ కనిపించడంతో గొడవల కారణంగా ఈ సినిమా షూటింగ్ ముందుకెళుతుందో.. లేదో అనే అనుమానాలకు తెరపడింది. కానీ.. మంచు మనోజ్ సినిమాలపై ఫోకస్ పెట్టడంతో ‘భైరవం’ దర్శకనిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. తన బౌన్సర్లను, వ్యక్తిగత సిబ్బందిని కూడా బుధవారం(డిసెంబర్ 11, 2024) సాయంత్రమే మనోజ్ పంపించేసినట్లు సమాచారం. గొడవలను పక్కన పెట్టి సినీ కెరీర్పై దృష్టి పెట్టాలని మనోజ్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. ‘భైరవం’ సినిమాకు అల్లరి నరేష్ నటించిన ‘నాంది’, ‘ఉగ్రం’ సినిమాల దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. కెకె రాధామోహన్ నిర్మాత. ‘భైరవం’ సినిమాలో మనోజ్ ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే విడుదలైంది.

నానా రచ్చ జరిగి ఇంటి గొడవ కాస్తా వీధిన పడటంతో మోహన్​బాబు కుటుంబం ఆలస్యంగా మేలుకుంది. పెద్ద కొడుకు విష్ణు, చిన్నకొడుకు మనోజ్ను ఎగ్జిక్యూటీవ్‌‌ మెజిస్ట్రేట్‌‌ హోదాలో రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు విచారించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్​ ఇచ్చారు. వ్యక్తిగత పూచికత్తు కింద ఒక్కొక్కరి వద్ద  లక్ష రూపాయల చొప్పున పర్సనల్‌‌ బాండ్‌‌ డిపాజిట్‌‌ చేయించుకున్నారు. లా అండ్ ఆర్డర్‌‌‌‌కు విఘాతం కలిగే విధంగా ఎలాంటి పబ్లిక్ న్యూసెన్స్ చేయబోమని హామీ ఇచ్చారు. 

Also Read:-పెళ్లైన తర్వాత కొత్త జంట చైతూ, శోభిత అటెండ్ అయిన మొదటి పెళ్లి వీళ్లదే

మంచు మనోజ్‌పై జరిగిన దాడి కేసులో మోహన్‌‌బాబు ఫామ్‌‌హౌస్‌‌ మేనేజర్‌‌‌‌ కిరణ్‌‌కుమార్‌‌తో పాటు మరో వ్యక్తి విజయ్‌‌రెడ్డిని పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించి విచారిస్తున్నారు. మనోజ్‌‌ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. మనోజ్‌‌ సీపీ ఆఫీస్‌‌ నుంచి తిరిగివెళ్లిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో విష్ణు సీపీ సుధీర్‌‌‌‌బాబు ముందు హాజరయ్యారు. మనోజ్‌తో కుటుంబ కలహాలు ఎంతకాలంగా ఉన్నాయనే వివరాలను వెల్లడించారు. తన తండ్రి మోహన్‌‌బాబుతో విభేదించి మనోజ్‌‌ దంపతులు ఇంట్లో పలుమార్లు గొడవలు చేశారని ఆయన చెప్పారు. పెద్దలు కూర్చుని మాట్లాడుకునే అంశాలను రోడ్డున పడేశారని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తమ మధ్య నెలకొన్న వివాదాలను చట్టానికి లోబడి పరిష్కరించుకుంటామని సీపీకి ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది.