బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’..2024 బెస్ట్​ సోషల్​ మీడియా ట్రోల్.. 

బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’..2024 బెస్ట్​ సోషల్​ మీడియా ట్రోల్.. 

గాడిద గుడ్డు..పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గాడిదగుడ్డును తెరమీదకు తెచ్చింది.పదేండ్లు దేశాన్ని పాలించిన మోదీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని ప్రచారం చేసేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మ గాడిదగుడ్డును తెరపైకి తెచ్చారు. ప్రతి సిగ్మెంట్ లో ప్రచారం సందర్భంగా ప్రదర్శించారు.

ఈ టాయ్ ఎగ్ సోషల్ మీడియాలనూ బాగా టోల్ అయ్యింది. 

కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న కబీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని సీఎం రేవంత్​ రెడ్డితో సహా కాంగ్రెస్​ నేతలు యూత్​ కాంగ్రెస్​ నేతలు బీజేపీ దుమ్మెత్తిపోశారు. ఛాన్స్​ వచ్చికాడల్లా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికించి ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్​ కార్యాలయం గాంధీ భవన్​  వద్ద గాడిద గుడ్డు ఆకారంలో బొమ్మను ఏర్పాటు  చేసిన వినూత్న నిరసనలు చేపట్టారు. 

ALSO READ | నిమ్స్ లో ఉద్యోగుల పదవీ విరమణ.. ఘనంగా సన్మానించిన డైరెక్టర్

గత పదేండల్లో  కేంద్రంలోని బీజేపీ విభజనసందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను గాడిద గుడ్డు ప్రచారంతో బాగా ప్రజల్లో తీసుకెళ్లారు.  తెలంగాణకు నిధులు, మేడారం జాతర, పాలమూరు చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజేపేట రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఇవ్వమంటే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని పార్లమెంట్​ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. కొంత వరకు సక్సెస్​ కూడా అయ్యారు. ఏదీ ఏమైనా.. గాంధీభవన్​వద్ద ఉంచిన ఎగ్​ టాయ్​ సోషల్​ మీడియాలో బాగా వైరల్ అయింది.