హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రొయ్య పిల్లల పంపిణీలో రూ. 300 కోట్లకు పైగానే స్కామ్ జరిగిందని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే సుమారు 900 కోట్ల చేప పిల్లల పంపిణీలో స్కామ్ జరగ్గా.. తాజాగా రొయ్య పిల్లల పంపిణీలో రూ.300 కోట్ల స్కామ్ జరిగినట్లు తమకు ఆధారాలు అందాయని చెప్పారు. ఈ అవినీతిలో హరీశ్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఉందని చెప్పారు. వీరి మోసాల చిట్టాకు సంబంధించిన ఫైల్ వారంలో తమ చేతికి అందనుందన్నారు. అప్పటి ప్రభుత్వం తెలంగాణ మత్స్యకారుల నోట్లో మట్టికొట్టి, ఆంధ్రా దళారులకు మేలు చేసిందని మండిపడ్డారు.