లక్ష్మణచాంద(మామడ), వెలుగు : సీఎం కేసీఆర్ సారథ్యలోని సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని, మూడోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని మంత్రి, నిర్మల్అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా గురువారం మామడ మండలం వాస్తపూర్ లో గుస్సాడీ నృత్యం, మంగళ హారతులతో, బతుకమ్మ ఆటపాటలతో మహిళలు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిపేస్టో నిరుపేదలకు వరం లాంటిదన్నారు. తండాలను గ్రామపంచయతీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు.
ఇగ ఎన్నికల ఎప్పుడూ ఈ ఊరి ముఖం చూడని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం ఇప్పుడు వస్తున్నారని.. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్న ఒక్క సంక్షేమ పథకమైనా అమలవుతుందా అని ఆ పార్టీల లీడర్లను ప్రశ్నించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, హరీశ్ కుమార్, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, గంగారెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్ గౌడ్, పాల్గొన్నారు.