ఆరు గ్యారంటీలతో మోసం చేసే కుట్ర : సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలి
  • మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జనగామ, వెలుగు : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కుడి భుజం లాంటి పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని జనగామ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గం నర్మెట మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రితో పాటు, పల్లా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన తర్వాతే తండాలు, గ్రామాల అభివృద్ధి జరిగిందని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ 60 ఏళ్లలో చేసిందేమీ లేదని, ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.

తెలంగాణ రాకముందు ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కొందరు వలస పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో ఇతర దేశాల్లో స్థిర పడిన వారు సైతం స్వగ్రామానికి వచ్చి ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పారు. జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు పల్లాను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇస్తే కర్ణాటక మాదిరిగా తెలంగాణ కూడా అంధకారం అవుతుందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ లీడర్ల మాట మాటలు నమ్మొద్దని చెప్పారు.

జనగామ రూపురేఖలు మారుస్తా

తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తనను గెలిపిస్తే జనగామ రూపురేఖలే మారుస్తానని పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి పనిలో అవినీతికి పాల్పడే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలో.. తొమ్మిదిన్నరేండ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. తాను గెలిచిన వెంటనే అర్హులైన వారందరికీ గృహలక్ష్మి కింద ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నిధులు తీసుకొచ్చి ప్రాధాన్యతాక్రమంలో పనులు చేయిస్తానని చెప్పారు.

ప్రజలు చెబుతున్న ప్రతీ సమస్యను నోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నానని, వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తానన్నారు. యువతకు ఏం కావాలో తెలుసుకొని వాటిని అందజేస్తానని చెప్పారు. -సేవాలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవనాలు, బీటీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కొమ్మూరి అభివృద్ధిలో పోటీ పడాలి కానీ నీతిమాలిన రాజకీయం చేయొద్దని చెప్పారు. 

ALSO READ : కాంగ్రెస్‌‌‌‌లో చేరినోళ్లను బెదిరిస్తున్నరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి