ఎములాడ రాజన్నకు రూ.కోటిన్నర ఆదాయం

వేములవాడ, వెలుగు :  కార్తీకమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్​స్థాయిలో ఆదాయం సమకూరింది. బుధవారం భద్రత నడుమ ఆలయంలో  హుండీలను  లెక్కించగా 32 రోజులకు1 కోటి 50 లక్షలు నగదు వచ్చింది. గోల్డ్170 గ్రాములు, వెండి 9. 800 కిలోలు  వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. నెల రోజులుగా లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు చెప్పారు.  ఆలయ ఈఓ వినోద్​ రెడ్డి, ఆలయ సేవా సమితి సభ్యులు, పాల్గొన్నారు. నిన్న ఒక్కరోజు స్వామి వారిని 35,305 మంది భక్తులు దర్శించుకున్నారు.