* నిజాం కాలంలో సర్ఫేఖాస్ భూముల నుంచి నిజాం నవాబుకు ప్రతి ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది.
* 1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను వినోబా భావేకు అప్పగించారు.
* మహాత్మా గాంధీని ప్రభావితం చేసిన ఆంగ్ల తత్వవేత్త సర్ జాన్ రస్కిన్ రచించిన అన్టూ ది లాస్ట్.
* సర్ జాన్ రస్కిన్ గ్రంథమైన అన్ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువాదం చేశారు.
* భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా ఉద్భవించాయి.
* సర్వోదయ సమితి మొదటి సమావేశం 1949లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
* సర్వోదయ సమితి రెండో సమావేశం 1950లో ఒడిశాలోని అంగుల్‌లో జరిగింది.
* సర్వోదయ సమితి మూడో సమావేశం హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో జరిగింది.
* సర్వోదయ సమితి మూడో సమావేశం 1951 ఏప్రిల్ 8 నుంచి 11 వరకు జరిగింది.
* శివరాంపల్లి గ్రామంలో జరిగిన సర్వోదయ సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా వినోబా భావే హాజరయ్యారు.
* శివరాంపల్లిలో సర్వోదయ సమితి సమావేశం అనంతరం వినోబా భావే ఏప్రిల్ 15న తెలంగాణ పర్యటనను ప్రారంభించారు.
* వినోబా భావే తెలంగాణ పర్యటనలో ఆయన వెంట నడిచిన ముఖ్య నాయకులు మర్రి చెన్నారెడ్డి, మేల్కోటే.
* 1951 ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లా పోచంపల్లిలో వినోబా భావే సమక్షంలో 100 ఎకరాలు భూమిని దానంగా ఇస్తున్నట్లు భూస్వామి వెదిరే రామచంద్రారెడ్డి ప్రకటించారు.
* నల్లగొండ జిల్లా భువనగిరి తాలుకా పోచంపల్లిలో భూదానోద్యమం పుట్టింది.
* భూస్వాములు తమ భూమిలో 1/ 6 వంతు భూమిని నిరు పేదలకు దానం చేయాలని వినోబా భావే సూచించారు.
* వినోబా భావేకు తన పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుకా నాగిళ్ల గ్రామంలో ఒక పేద రైతుకు దానం చేశారు.
* హైదరాబాద్ స్టేట్ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనం 1951, జూన్ 7న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగింది.
* దానంగా ఇచ్చిన భూమిని పంచడానికి ఆ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి 1951 జూన్ 7న వినోభా బావే భూదాన యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు.
* భూదాన యజ్ఞసమితి కన్వీనర్‌గా ఉమ్మెత్తల కేశవరావును నియమించారు.
* భూదాన యజ్ఞసమితి సభ్యులు కేతిరెడ్డి కోదండరాంరెడ్డి, సంగం లక్ష్మీబాయి.
* 1951 జూన్ 7న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగిన హైదరాబాద్ స్టేట్ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి బి. రామకృష్ణారావు హాజరయ్యారు.
* హైదరాబాద్ రాష్ట్రం భూదానానికి సంబంధించిన చట్టాన్ని 1951లో ప్రకటించింది.
* వినోబా భావే తెలంగాణలో తన మొదటి పాదయాత్రలో 12000 ఎకరాల భూమిని దానంగా పొందాడు.
* శంకర్రావు దేవ్ 1952లో మెదక్ జిల్లాలో పర్యటించి 15 రోజుల్లో 4000 ఎకరాల భూమిని దానంగా పొందారు.
* 1954లో తెలంగాణలో రెండు సార్లు పర్యటించిన కృష్ణదాస్ జాజూ సర్వోదయ కార్యకర్తలకు ప్రేరణ కలిగించారు.
* హైదరాబాద్ రాష్ట్రంలో జయప్రకాశ్ నారాయణ 1952 ఆగస్టులో పర్యటించారు.
* తెలంగాణలో వినోబా భావే భూదానోద్యమ రెండో యాత్ర 1955 డిసెంబర్ లో ఖమ్మం జిల్లా ముత్తుగూడెం నుంచి ప్రారంభమైంది. ఈయనకు హైదరాబాద్ సీఎం బూర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థ మొదలైన వారు స్వాగతం పలికారు.
* హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వినోబా భావే మొదటి భూదాన యాత్ర సందర్భంగా 3500 ఎకరాలు భూమిని దానంగా ఇచ్చాడు.
* 1956 ఫిబ్రవరి 8న వినోభా బావే పాల్మాకోల్ గ్రామానికి చేరుకున్నప్పుడు ఆయనతోపాటు అప్పటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ భూదాన ఉద్యమ యాత్రలో పాల్గొన్నాడు.
* వినాబా భావే భూదాన ఉద్యమ యాత్రలో భాగంగా అప్పటి ప్రధాని నెహ్రూ 1956 మార్చి 5న మాధరావుపల్లెలో పాల్గొన్నారు.
* వినోబా భావేను కమ్యూనిస్టులు సర్కారు సాధు అని విమర్శించారు.
* భూదానం ద్వారా వచ్చిన భూమిని 1996 వరకు భూమిలేని వారికి పంపిణీ చేశారు.
* భారతదేశ వ్యాప్తంగా వినోబా భావే 13 సంవత్సరాల్లో 36,500 మైళ్లు పాదయాత్ర చేసి 40.4 మిలియన్ ఎకరాల భూమిని దానంగా పొందారు.