రాజన్న సిరిసిల్ల జిల్లా : మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మిడ్ మానేరు ఐక్యవేదిక కన్వీనర్ తో పాటు పలువురు రాజకీయ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ముందస్తు అరెస్ట్ లపై రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అది శ్రీనివాస్ స్పందించారు. జిల్లాకు మంత్రి కేటీఆర్ వస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు జిల్లాలో ఉండకూడదా..? అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మంత్రి కేటీఆర్ కు పోలీసుల వలయం ఎందుకన్నారు. మంత్రి కేటీఆర్ నియంత్రణ పాలన ఇంకెన్నాళ్లు..? అని ప్రశ్నించారు.