Total Solar Eclipse 2024: ఆదిత్య-ఎల్1 గురించి మనకు తెలిసిందే.. సూర్యునిపై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన మిషన్ ఇది. అయితే ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా జరిగే మార్పులను ఆదిత్య ఎల్ ట్రాన్ చేయనుంది.
సూర్యుడు, చంద్రుని కదలికలు, చికట్లో జరిగే పరిమాణాలను ఆదిత్య ఎల్1 తన పేలోడ్స్ ద్వారా రికార్డు చేయనుంది. సూర్యునిలో జరిగే మార్పులు, కిరణాలను ట్రాక్ చేస్తుంది. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని ట్రాక్ చేయడానికి ఆదిత్య ఎల్ 1 తన ఆరు పరికరాల్లో రెండు విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ ( VELC) , సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) లను ఉపయోగించనుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తొలి సోలార్ మిషన్ అయిన ఆదిత్య ఎల్ 1.. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిన ట్రాక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. సూర్యుడి క్రోమోస్పియర్, కరోనాను అధ్యయనం చేయడానికి ఇస్రో సాయపడుతుంది.
2024 అక్టోబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. నాలుగు నెలల తర్వాత 2024 జనవరి 6న లాగ్రాంజ్ పాయింట్ 1(ఎల్1) కి చేరుకుంది. భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉ్న లాగ్రాంజ్ పాయింట్ నుంచి సూర్యుడిని ట్రాక్ చేసి సూర్యగ్రహణం సందర్భంగా జరిగి అద్భుతాలను తన పేలోడ్స్ ద్వారా ఇస్రోకు పంపనుంది.