IND vs SL 2024: టీమిండియాతో సిరీస్.. గాయంతో లంక స్టార్ పేసర్ ఔట్

IND vs SL 2024: టీమిండియాతో సిరీస్.. గాయంతో లంక స్టార్ పేసర్ ఔట్

టీమిండియాతో టీ20,వన్డే సిరీస్ కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా  మొత్తం పర్యటనకు దూరమయ్యాడు. శ్రీలంక క్రికెట్ చమీర స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. అసిత ఫెర్నాండో, ప్రమోద్ మధుషన్‌లలో ఒకరు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఈ లంక పేసర్ తన కెరీర్ లో తరచూ గాయాలకు గురవ్వడం ఆందోళన కలిగిస్తుంది.   2015లో అరంగేట్రం చేసిన ఈ 32 ఏళ్ల పేసర్ 12 టెస్టులు, 52 వన్డేలు, 55 టీ20ల్లో 143 వికెట్లు పడగొట్టాడు.

శ్రీలంక క్రికెట్ టీ20 సిరీస్ కు 16 మందితో కూడిన స్క్వాడ్ ను మంగళవారం (జూలై 23) ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్‌, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.  

భారత్ సిరీస్ కోసం శ్రీలంక టీ20 జట్టు

చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, డి నుష్‌ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీమ్‌వన్‌ విక్రమసింఘే, ఫెర్నాండో