పెరిగిన సందర్శకుల తాకిడి
‘డస్కీ ఈగల్ గుడ్లగూబ’ అంతరించిపోతున్న పక్షులు. ఎక్కడో రాజస్థాన్ లో కనిపించే ఈ పక్షులు హఠాత్తుగా మన వరంగల్ జిల్లాలోని పాకాల వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో దర్శనమిచ్చాయి. గూడు కట్టుకుని హాయిగా బతుకుతున్నాయి. వీటిని చూసేందుకు వరంగల్,హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి పక్షి ప్రేమికులు పాకాల సరస్సుకు తరలివస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో తొలిసారి శాంక్చువరీలో డస్కీ ఈ గుడ్లగూబలు తిరుగుతున్నట్లు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీ రామ్ రెడ్డి గుర్తించారు. ఈ విషయాన్ని శాంక్చువరీ మేనేజ్ మెంట్ కు చేరవేశారు. కొద్ది రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండు గుడ్లగూబలు ఉన్నట్లు తేల్చారు.అప్పటి నుంచి అరుదైన ఈ పక్షుల్ని చూసేందుకు పక్షి ప్రేమికులు పాకాల శాంక్చువరీకి క్యూ కడుతున్నారు. గత ఆరునెలల్లో 200 మందికి పైగా పక్షిప్రేమికులు శాంక్చువరీకి వచ్చారని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ఆఫీసర్(డీఎఫ్ఓ) కె.పురుషోత్తం చెప్పారు.
డస్కీఈగల్ గుడ్లగూబ తెలంగాణకు చెందినది కాదు. ఇవి ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగాకనిపిస్తాయి. ప్రధానంగా రాజస్థాన్ లోని కెలడియో నేషనల్ పార్కు లో ఉంటాయి. పాకాల శాంక్చువరీలో హైదరాబాద్ బర్డిం గ్ పాల్స్(హెచ్ బీపీ)లో సభ్యులైన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్స్ 225 జాతుల పక్షులను గుర్తించా రు. థిక్ బిల్డ్ గ్రీన్ పీజియన్, క్రెస్టెడ్ బంటింగ్, రెడ్ స్పర్ ఫౌల్, బ్రౌన్ ఫిష్, మోటల్డ్ ఓల్ ఫిగర్ తదితర జాతులు వీటిలో ఉన్నాయి. రెడ్ క్రస్టెడ్ పొచార్డ్, కామన్ పొచార్డ్, గర్గానీ, గడ్వాల్, నార్తన్ పిన్ టెయిల్, యురేసియన్ పీజియన్ అనే పక్షులు చలికాలంలో శాంక్చువరీకి వలస వచ్చి వెళ్తుంటాయి.